in the village
Sunday, 2023-Nov-26
తేదీ: 26-11-2023 న తన స్వగ్రామం బాలెంల లో... సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి విజయం కోసం గడప గడపకు ప్రచారం నిర్వహించిన...
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు..!!
సర్పంచుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నన్ను MPTC, ZPTC గా గెలిపించి...
ఈరోజు రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదగడానికి ఆశీర్వదించిన మీ రుణం మరువలేనిది..!!
ప్రతి ఎన్నికలలో నన్ను ఆశీర్వదించిన విధంగానే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం మీ సంపూర్ణ మద్దతు తెలపండి..!!
అసెంబ్లీ అభ్యర్థిగా త్రుటిలో అవకాశం కోల్పోయినప్పటికీ...
క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ సైనికునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తున్నాను..!!
సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి గారి కోసం చేసిన త్యాగానికి,
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నల్లగొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది..!!
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డాను..!!
భవిష్యత్తులో కూడా ప్రజల మధ్యనే కొనసాగుతూ ప్రజాసేవకే అంకితం అవుతాను..!!
30 వ తారీకున జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించండి..!!
రాష్ట్రంలో కెసిఆర్, సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి,ఆగడాలకు, అరాచకాలకు చరమగీతం పాడండి..!!
కొన్ని రోజులలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడనున్నది..!!
కెసిఆర్ పాలన లో నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది..!!
అదేవిధంగా సూర్యాపేట మండలం K.T. అన్నారం గ్రామంలో జరిగిన కార్యకర్తలకు సమావేశంలో పాల్గొని మాట్లాడారు..!!
ఈ మూడు రోజులపాటు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని అని రమేష్ రెడ్డి గారు మాట్లాడారు..!!