Suryapet Town
Wednesday, 2023-Apr-05
సూర్యాపేటలో కాంగ్రెస్ సభా ర్యాలీకి పోటెత్తిన ప్రజలు...సభ విజయవంతం
శ్రీ రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సందేశాన్ని గడపగడపకు చేర్చడంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గ...
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి చేపట్టిన
హాత్ సే హాత్ జోడో అభియాన్ మహా పాదయాత్ర..
5-04-2023 నాటికి 43 రోజున
దాదాపు 525 కిలోమీటర్లు పూర్తిచేసుకుని సూర్యాపేట పట్టణంలో బహిరంగ సభతో ముగిసింది.
సూర్యాపేట పట్టణంలో శాంతినగర్ నుండి కొత్త బస్టాండ్ వరకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు..
పటేల్ రమేష్ రెడ్డి కామెంట్స్:-
★ప్రజా సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీనే అసలు చిరునామా.
★రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పెన్షన్లు, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కాంగ్రెస్ హయాంలో నేరుగా అమలు అయ్యాయి.
★కానీ నేడు కేసీఆర్ పాలన పేదవాడి నుండి లాగి పెద్దవారికి దోచిపెట్టె కార్యక్రమంగా మారాయి.
★దేశంలో బిజెపి రాష్ట్రంలో ,బీఆర్ఎస్ ప్రజలను పన్నులు, ధరల పెంపుతో పీక్కుతింటున్నాయి.
★కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల బతుకులు మారలేదు.
బీఆర్ఎస్ నేతలు కోట్లకు పడగలెత్తారు.
★మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ,బిజెపి పార్టీలను ప్రజలు బొంద పెట్టాల్సిన అవసరం ఉంది.
★సూర్యాపేట నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోయాయి.
★ఈ నియోజకవర్గంలో అధికారులు వారి బాధ్యతను విస్మరించి అధికార పార్టీ నేతలకు ఊడిగం చేస్తున్నారు.
★ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు బీఆర్ఎస్ నేతల్లా వ్యవహరిస్తూ వారి చెప్పుచేతల్లో ఉంటున్నారు.
★టిఆర్ఎస్ నేతలు చేసే అవినీతి కార్యకలాపల్లో అడుగడుగున వారికి అండగా ఉంటూ అక్రమాలలో భాగస్వాములుగా పనిచేస్తున్నారు.
★అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. ప్రజలకు పారదర్శకంగా సేవలందించండి. కానీ ఒంటెద్దు పోకడలు పోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
★ఈ సూర్యాపేట ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం గత 30 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నా...
★నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. సూర్యాపేటను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.
★నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించండి... నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం చేయించే బాధ్యత నేను తీసుకుంటా...
★అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది.
★ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు పదివేల ఉద్యోగాలను కల్పిస్తానని మాటిస్తున్నా...
★ఈ ప్రాంతంతో అనుబంధం లేని నాయకులకు గతంలో ఎమ్మెల్యేగా అవకాశమిచ్చాం... ఈ ప్రాంత బిడ్డగా అడుగుతున్నా.... ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా
★మనం ఎన్నో ఏళ్లుగా కలలుగన్న తెలంగాణ ఆకాంక్షల నెరవేర్చిన సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని బిజెపి ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తోంది.
★గాంధీ కుటుంబం ఈ దేశ స్వాతంత్రం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు ఎన్నో త్యాగాలు చేసింది.
★కెసిఆర్ అధికారమే పరమావధిగా బిజెపితో కుట్రపన్ని కాంగ్రెస్ ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.
★రెండు ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలి.. అక్రమ బంధంతో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేస్తున్నాయి.
★ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.