Cheedella village
Saturday, 2023-Mar-25
Date: March 25, 2023
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు కొనసాగిస్తున్న పాదయాత్ర..
పెన్ పహాడ్ మండలం లో దిగ్విజయంగా కొనసాగుతున్నది..!!
చీదెళ్ళ గ్రామంలో పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి రమేష్ రెడ్డి ప్రసంగించారు..!!
మోడీ అమిత్ షా ల నియంతృత్వ పోకడలు మన దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టు వేస్తున్నాయి..!!
ప్రజా వ్యతిరేక బిజెపి పాలన ను వ్యతిరేకించి, దేశంలో ఇందిరమ్మ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలని ఉద్దేశంతో..
రాహుల్ గాంధీ దేశవ్యాప్త పర్యటన చేసి తిరుగులేని ప్రజా నాయకుడు గా అంతరించడం చూసి బిజెపి శక్తులకు భయం పట్టుకుంది..!!
ఆదాని, అంబానీ ల దోపిడి తో ప్రధానికి ఉన్న సంబంధాన్ని..
పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గారిని కుట్రలతో, అక్రమ కేసులో ఇరికించి పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడి గా ప్రకటించడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు..!!
మోడీ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులను ముఖ్యంగా దళిత వర్గాలను ఉక్కు పాదంతో అణగదొక్కుతున్నారు..!!
బిజెపి తాటాకు చప్పుళ్ళకు ప్రజాస్వామ్యవాదులు బెదరరు అని హెచ్చరిస్తున్నాం..!!
ప్రశ్నించడమే నేరమైతే...
మన నాయకుడు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.
మేము సైతం జైళ్లకు వెళ్లడానికి సిద్ధమే అని రమేష్ రెడ్డి గారు హెచ్చరించారు..!!
కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ల 9 సంవత్సరాల అక్రమ, అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నది..!!