Rangaiah gudem village
Saturday, 2023-Mar-18
18-03-2023 శనివారం
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు నిర్వహిస్తున్న మహా పాదయాత్ర..
ఈ రోజు ఉదయం చివ్వేంల మండలం గుంజలూరు నుండి ప్రారంభించి ఈరోజు పెన్ పహాడ్ మండలం భాగ్య తండా, రంగయ్య గూడెం లోకి చేరుకున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డప్పులు కోలాటాలతో బ్రహ్మాండమైన స్వాగతం పలికారు..!!
పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ..
1200 మంది విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మ బలిదానాల కు చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు..!!
నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో సామాన్యుడు బాగుపడింది ఏమీ లేదని అన్నారు..!!
బంగారు తెలంగాణ నినాదంతో అక్కడ కల్వకుంట్ల కుటుంబము, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి..!!
నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించకుండా నిద్రపోతున్న దున్నపోతు ప్రభుత్వం, మరియు జగదీశ్వర్ రెడ్డిని నిలదీయడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాం..!!
పాదయాత్ర 29వ రోజున ఇప్పటివరకు 355 కిలోమీటర్లు పూర్తి అయింది..!!